నార్కట్పల్లి, వెలుగు: మహిళలకు పెద్దపీట వేసిన పార్టీ కాంగ్రెస్ అని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం నార్కట్పల్లి మండలంలోని షాపల్లి, నక్కలపల్లి, అక్కినపల్లి, అమ్మనబోలు, బెండలపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని తెలిపారు. పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు.
అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన దాసరిగూడెం సర్పంచ్ ఉప్పల వెంకట్రెడ్డి, ఉప సర్పంచ్ పబ్బతిరెడ్డి సంతోష్ రెడ్డిని ఎమ్మెల్యే సత్కరించారు. గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య గౌడ్, నాయకులు సత్తయ్య, సాగర్ రెడ్డి, సర్పంచ్ అభ్యర్థులు ఏర్పుల మంజుల, గాయం స్వప్న, కొంపెల్లి సైదులు, మాజీ సర్పంచ్ బింగి కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
