మజ్లిస్​​కు చెక్ ​పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహం

మజ్లిస్​​కు చెక్ ​పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహం
  • మజ్లిస్​​కు చెక్ ​పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహం 
  • హైదరాబాద్ పార్లమెంటు బరిలో అలీ మస్కతిని నిలిపే చాన్స్
  • గతంలో టీడీపీ ఉపాధ్యక్షుడిగా పని చేసిన మస్కతి
  • ఇటీవల తుక్కుగూడ సభలో కాంగ్రెస్ లో చేరిక

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్​ లోక్​సభ నియోజకవర్గం నుంచి తిరు గులేకుండా గెలుస్తున్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ఈసారి గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్​ సిద్ధమవుతున్నది. గతంలో టీడీపీ హయాంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేసిన అలీ మస్కతి ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన తుక్కుగూడ సభలో ఆ పార్టీలో చేరారు. గతంలో టీడీపీ తరఫున చార్మినార్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. 

మైనారిటీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ సారి హైదరాబాద్ ఎంపీగా ఆయనను పోటీ చేయించేందుకు కాంగ్రెస్ రెడీ అవుతున్నట్లు సమాచారం. అలీ మస్కతిని హైదరాబాద్ పార్లమెంట్ రంగంలోకి దింపితే అసదుద్దీన్​కు చెక్ పెట్టవచ్చని కాంగ్రెస్ భావిస్తున్నది. అలీ మస్కతి హైదరాబాద్ బరిలో ఉంటే మజ్లిస్ పై ప్రభావం చూపిస్తుందని, మైనారిటీ ఓటర్లను ఆకట్టుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తున్నది.