ఇండిగో విమానంపై పిడుగు..లక్నోలో అత్యవసర ల్యాండింగ్

ఇండిగో విమానంపై పిడుగు..లక్నోలో అత్యవసర ల్యాండింగ్

లక్నో: గాల్లో ప్రయాణిస్తున్న ఓ విమానాన్ని పిడుగు తాకడంతో ఫ్లైట్ ముందుభాగం (నోస్) దెబ్బతింది. గురువారం పాట్నా నుంచి లక్నో బయలుదేరిన ఇండిగో విమానం 17 వేల అడుగుల ఎత్తులో ఉండగా ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన పైలట్లు అత్యవసరంగా లక్నో విమానాశ్రయంలో ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. 

పైలట్లు ధైర్యంగా వ్యవహరించి విమానాన్ని షెడ్యూల్ కంటే 8 నిమిషాల ముందే లక్నోలో సేఫ్‌గా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ విచారణకు ఆదేశించింది. రెగ్యులేటరీ క్లియరెన్స్ వస్తేనే ఫ్లైట్​ను మళ్లీ సర్వీసులోకి అనుమతించనున్నారు.