సర్కారు ఆఫీసుల్లో మీ- ప్రమాణం యాప్..ఉద్యోగులు ఫోన్ ద్వారానే ఫేషియల్ అటెండెన్స్

సర్కారు ఆఫీసుల్లో మీ- ప్రమాణం యాప్..ఉద్యోగులు ఫోన్ ద్వారానే ఫేషియల్ అటెండెన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హాజరు విధానంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు సర్కారు సరికొత్త సాంకేతికతను తీసుకొచ్చింది. ఉద్యోగుల హాజరు నమోదు కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలోని ఈఎస్డీ (మీసేవ) విభాగం సొంతంగా 'మీ–ప్రమాణం' పేరిట మొబైల్ ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌‌‌‌ను రూపొందించింది. 

ఈ యాప్ తో ముఖ ఆధారిత హాజరును రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాధిపతుల(హెచ్‌‌‌‌ఓడీ) ఆఫీసుల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఐటీఈ అండ్ సీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఈఎస్డీ మీసేవ కమిషనర్ టి.రవికిరణ్ అన్ని శాఖల అధిపతులు, కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. 

ఉద్యోగుల స్మార్ట్‌‌‌‌ఫోన్ల ద్వారానే అటెండెన్స్ వేసేలా దీన్ని సిద్ధం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాల్లోనూ అడ్మిన్ ఐడీల నమోదు ప్రక్రియ ముమ్మరమైంది. వనపర్తి జిల్లాలో పైలట్​ ప్రాజెక్ట్ కింద వివిధ శాఖల నోడల్ అధికారుల వివరాలను సేకరించి యాప్ అడ్మిన్ క్రెడెన్షియల్స్ సిద్ధం చేస్తున్నారు.