- సీఎంపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: పీసీసీ ప్రధాన కార్యదర్శి, ఏఐసీసీ ఓబీసీ కన్వీనర్ కత్తి వెంకటస్వామికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ బుధవారం షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఓ టీవీ డిబేట్ లో ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై అనుచితమైన వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు అందాయి.
దీని ఆధారంగా వెంకటస్వామికి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. మూడు రోజుల్లో దీనిపై జవాబు ఇవ్వకుంటే పార్టీపరంగా చర్యలు తప్పవని కమిటీ హెచ్చరించింది.
