ఈ నెల 24 నుంచి కాంగ్రెస్ రెండో విడత పాదయాత్ర

ఈ నెల 24 నుంచి కాంగ్రెస్ రెండో విడత పాదయాత్ర
  • కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో మూడు రోజుల పాటు నిర్వహణ

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ రెండో విడత జనహిత పాదయాత్ర ఈ నెల 24 నుంచి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో  కొనసాగనుంది. కరీంనగర్, వరంగల్.. రెండు ఉమ్మడి జిల్లాల్లో మూడు రోజుల పాటు ఈ యాత్ర నిర్వహించనున్నారు. ఈ నెల 24న సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర ప్రారంభం కానుంది. 25న  సాయంత్రం 5 గంటలకు వరంగల్ ఉమ్మడి జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో పాదయాత్ర సాగనుంది. 26న హైదరాబాద్ బయలుదేరి అదే రోజు సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరగనుంది.