మందమర్రిలో గడప గడపకు కాంగ్రెస్..మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో..

మందమర్రిలో గడప గడపకు కాంగ్రెస్..మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో..

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్ర  కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదేశాలతో శుక్రవారం మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలోని వార్డుల్లో గడప గడపకు కాంగ్రెస్​ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీలోని 19వ వార్డులో కాంగ్రెస్​ ప్రజా ప్రభుత్వం అందించే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతీ ఒక్కరికి చేరవేయాలనే ఉద్దేశ్యంతో ప్రోగ్రామ్​ చేపట్టారు.

కాంగ్రెస్​ లీడర్లు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం పథకాలతో కూడిన పాంప్లెట్లను పంపిణీ చేశారు. పథకాల అందుతున్న విషయంపై ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉంటే రెండు రోజుల్లో తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో కూడా కార్యక్రమాన్ని చేపడుతామని లీడర్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, సీనియర్​ లీడర్​ సుదర్శన్, స్థానిక లీడర్లు పాల్గొన్నారు.   ----