ఓట్ చోరీపై కాంగ్రెస్ సిగ్నేచర్ క్యాంపెనింగ్ : ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతె రోహిత్

ఓట్ చోరీపై కాంగ్రెస్   సిగ్నేచర్ క్యాంపెనింగ్ : ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతె రోహిత్

బషీర్​బాగ్, వెలుగు: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హరిస్తున్నదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతె రోహిత్ ఆరోపించారు. ఓట్ చోరీపై గన్ ఫౌండ్రి మాజీ కార్పొరేటర్ మమత సంతోష్ గుప్త ఆధ్వర్యంలో కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తాలో చేపట్టిన సిగ్నేచర్ క్యాంపెయిన్‌లో వారు పాల్గొన్నారు. ప్రజలకు బీజేపీ చేస్తున్న మోసాలను వివరించి సంతకాలు సేకరించారు.