బోధన్, వెలుగు : మండలంలోని ఊట్ పల్లి గ్రామంలో మల్లన్న కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకొని కోలాటం ఆడుతూ ఊరేగింపుగా తరలివెళ్లి స్వామివారికి నైవేద్యం సమర్పించారు.
అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చారు.
