బషీర్బాగ్, వెలుగు: గోషామహల్ ప్రాంతంలో యథేచ్ఛగా సాగుతున్న ఇండస్ట్రియల్ నకిలీ టూల్స్ విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. విశ్వసనీయ సమాచారంతో ఆదివారం సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, బేగంబజార్ పోలీసులు బేగంబజార్ లోని లబ్ధి ఎంటర్ప్రైజెస్ షాపులో నిల్వ ఉంచిన నకిలీ టీసీటీ సా బ్లేడ్లను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే నగరంలోని పలు షాపులపై దాడులు నిర్వహించారు. 2019 నుంచి లబ్ధి ఎంటర్ప్రైజెస్ కాన్వీ బ్రాండ్ పేరిట నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేశామని, సీజ్ చేసిన వస్తువులను ల్యాబ్ పరీక్షలకు పంపించామని బేగంబజార్పోలీసులు తెలిపారు. ఈ నెట్వర్క్ లో ఉన్న వారిని పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ నకిలీ టూల్స్ కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.
