ఆఫీసర్లూ... ఇటూ ఓ కన్నేయండి..

ఆఫీసర్లూ... ఇటూ ఓ కన్నేయండి..

గ్రేటర్​ వరంగల్​ పరిధిలోని వరంగల్​ మండల, కాజీపేట సర్కిల్​ ప్రాంతాల్లోని తహసీల్దార్​ ఆఫీసుల గోడలపై మొక్కలు, చెట్లు పెరిగాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని సిబ్బంది, అక్కడకు వచ్చే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఏండ్ల కింద నిర్మించిన ఈ భవనాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇలా మొక్కలు, చెట్లు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకుని ఎలాంటి ప్రమాదం జరుగకముందే చర్యలు తీసుకోవాలన్ని ప్రజలు కోరుతున్నారు. - కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు