- బీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ జీవన్ రెడ్డి
ఆర్మూర్, వెలుగు : జిల్లాలో రెండేండ్లు చేసిన అభివృద్ధిపై కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆర్మూర్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పదేండ్లలో తను చేసిన అభివృద్ధి పనులను ఆయన మీడియా సమావేశంలో వివరించారు.
రెండేండ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులను వివరించేందుకు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు బహిరంగ చర్చకు రావాలని సవాల్‌విసిరారు. కేసీఆర్ పాలనలోనే జిల్లాలో వేల కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు.
ఆర్మూర్ లో ఆర్టీవో ఆఫీస్, లిఫ్ట్ఇరిగేషన్స్, గురుకులాలు, కాలేజ్‌లు మంజూరయ్యాయని, సిద్దులగుట్ట ఘాట్‌రోడ్డు, వందల కిలోమీటర్ల బీటీ, సీసీ రోడ్లు వేయించానని, కుల సంఘాలకు ఫంక్షన్ హాల్స్ నిర్మించానని చెప్పారు. రెండేండ్లలో చారాణా పనిచేయని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్ఇన్చార్జి వినయ్‌రెడ్డి తనను విమర్శించడం మానుకోవాలన్నారు.
ప్రజలు ఫిర్యాదు చేస్తే సమస్యలు పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి, పోల సుధాకర్, పూజా నరేందర్, మీర శ్రావణ్, పృథ్వీ, గణేశ్, అజీమ్, అభిలాష్, లతీఫ్, రహమత్, సత్తర్ పాల్గొన్నారు.
