నిజామాబాద్ జిల్లాలో తొలి విడత పోలింగ్కు ఏర్పాట్లు..ప్రతి సెంటర్లో పీవో, ఒక ఏపీవో

నిజామాబాద్ జిల్లాలో తొలి విడత పోలింగ్కు ఏర్పాట్లు..ప్రతి సెంటర్లో పీవో, ఒక ఏపీవో
  • సెన్సిటివ్ విలేజ్​లపై పోలీసుల నజర్​
  • సీసీ కెమెరాలు, నిఘా టీంతో పర్యవేక్షణ

నిజామాబాద్​, వెలుగు : జిల్లాలో ఫస్ట్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే బోధన్ డివిజన్​లో యంత్రాంగం పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ కేంద్రాలను అధికారులు క్రాస్ చెక్ చేస్తున్నారు. ఆదివారం అధికారులకు శిక్షణ ముగించి మండలాలవారీగా పోలింగ్ కేంద్రాలకు అలాట్ చేశారు. ప్రతి సెంటర్​లో పీవో, ఏపీవో, హెల్ప్​ డెస్క్​లో బీఎల్​వోను అందుబాటులో ఉంచుతారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా పోలీస్​శాఖ బైండోవర్లు చేస్తోంది. సెన్సిటివ్​, హైపర్ సెన్సిటివ్​ విలేజ్​లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.    

ఏకగ్రీవాలతో కొంత ఊరట..

బోధన్​డివిజన్​లోని​11 మండలాల్లో మొత్తం 184 గ్రామ పంచాయతీలు, 1,642 వార్డులున్నాయి.  పోలింగ్​నిర్వహించడానికి 1,653 సెంటర్లు గుర్తించారు. అయితే 29 మంది సర్పంచ్​ల ఎన్నిక ఏకగ్రీవం కావడంతో 155 గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 519 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 575 వార్డులు కూడా యునానిమస్​అయ్యాయి. మిగితా 1,060 వార్డులకు పోలింగ్ ఏర్పాట్లు చేస్తుండగా, 2,734 మంది క్యాండిడేట్స్​బరిలో ఉన్నారు. పోలింగ్​నిర్వహణకు 20 శాతం రిజర్వ్ కలిపి 2,200 మందిని మండలాలవారీగా నియమించారు. 

472 సెంటర్లలో సమస్య..

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అల్లర్లు జరిగే చాన్స్ ఉన్న విలేజ్​లను పోలీసులు గుర్తించారు.  పాత రికార్డులతోపాటు తాజా పరిస్థితుల ఆధారంగా ఫస్ట్​ఫేజ్ ఎలక్షన్ జరిగే బోధన్​డివిజన్​లో 403 సెన్సిటివ్, 69 హైపర్ సెన్సిటివ్ పోలింగ్​కేంద్రాలను గుర్తించారు. ఫ్లాగ్​మార్చ్​నిర్వహించి ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు.  అనుమానితులను బైండోవర్​ చేసి వార్నింగ్ ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 326 రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెట్టారు. సమస్యాత్మక పోలింగ్​కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.