నిజామాబాద్ అర్బన్, వెలుగు : కార్పొరేషన్ ఎన్నికల్లో ‘మన ఇందూరు.. మన మేయర్’ ఇదే మా నినాదమని, ఇందూరు గడ్డపై కాషాయజెండాను ఎగరవేస్తామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. గురువారం నగరంలోని వివిధ డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ విశ్వగురువుగా ఎదుగుతుందని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఎంపీ అర్వింద్ సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, వీటికి ఆకర్శితులై వేరే పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
