అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు : ఎస్పీ రాజేశ్చంద్ర

అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు : ఎస్పీ రాజేశ్చంద్ర

కామారెడ్డిటౌన్, వెలుగు : ఎన్నికల సమయంలో సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాజేశ్​చంద్ర పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్​లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ వద్ద బందోబస్తును ఎస్పీ పరిశీలించి మాట్లాడారు. ప్రతి పోస్టును స్పెషల్ టీమ్ పరిశీలన చేస్తుందన్నారు. జిల్లాలో శాంతియుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు  నిర్వహించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందన్నారు.

 శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అభ్యర్థులు ఎలాంటి సమస్యలున్నా పోలీస్​ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఎలక్షన్ ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలని సూచించారు. టౌన్ సీఐ నరహరి ఉన్నారు.      

చోరీలపై అప్రమత్తంగా ఉండాలి 

తాడ్వాయి, వెలుగు : గ్రామాల్లో చోరీల కట్టడికి పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజేశ్​చంద్ర సూచించారు. గురువారం తాడ్వాయి పోలీస్ స్టేషన్​ను తనిఖీ చేసి మాట్లాడారు.   జిల్లా పోలీసులు చోరీ కేసులను ఛేదించడంలో పురోగతిని సాధించారని, మరింత మెరుగుపడేలా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్​లో సమాచారమిస్తే పెట్రోలింగ్​నిర్వహిస్తామన్నారు.  

పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, సివిల్ తగాదాల్లో తల దూర్చవద్దన్నారు.  డ్రంక్​అండ్​డ్రైవ్​ నిర్వహించి  మద్యం తాగి వాహనాలు నడిపితే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. క్రైమ్ రేట్ పరంగా తాడ్వాయి మండలంలో నేరాల సంఖ్య అదుపులోనే ఉందన్నారు. కార్యక్రమంలో ఏఎస్సై కొండల్ రెడ్డి, కానిస్టేబుళ్లు వేణుగోపాల్, సాయిబాబా, రమేశ్, అనిత, సౌజన్య తదితరులు పాల్గొన్నారు