కామారెడ్డిటౌన్, వెలుగు : మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం మీడియా సెంటర్‌ను అడిషనల్ కలెక్టర్లు మదన్మోహన్, విక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల నియమాళి ప్రకారం మీడియా పర్యవేక్షణ ఉండాలన్నారు. పేపర్లు, టీవీల్లో ప్రసారమయ్యే ఫెయిడ్ న్యూస్‌ను గుర్తించి వాటిని రిజిస్ట్రర్లలో నమోదు చేయాలని సూచించారు. డీపీఆర్వో తిరుమల, మైనార్టీ అధికారి అర్షత్ అలీ తదితరులు పాల్గొన్నారు.
