నిజామాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలు పురస్కరించుకొని గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ జిల్లా నేతలతో మీటింగ్ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, పార్లమెంట్ సెగ్మెంట్ ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఇందులో ఉన్నారు.
జిల్లాకు చెందిన గవర్నమెంట్ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, కార్పొరేషన్ చైర్మన్లు మానాల మోహన్‌రెడ్డి, అన్వేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు.
