AAIలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు.. డిగ్రీ/బీటెక్ పాసైనోళ్లు ఇప్పుడే అప్లయ్ చేసుకోండి..

 AAIలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు..  డిగ్రీ/బీటెక్ పాసైనోళ్లు  ఇప్పుడే అప్లయ్ చేసుకోండి..

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి,  అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ జనవరి11.

పోస్టుల సంఖ్య: 14.

పోస్టులు: సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) 05, జూనియర్ అసిస్టెంట్ (హెచ్ఆర్) 02, జూనియర్ అసిస్టెంట్(ఫైర్ సర్వీసెస్) 07.

ఎలిజిబిలిటీ 
సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యూనికేషన్/ రేడియో ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. 
జూనియర్ అసిస్టెంట్ (హెచ్ఆర్): గ్రాడ్యుయేషన్ + 30/25 w.p.m. ఇంగ్లిష్/ హిందీ టైపింగ్ వేగం ఉండాలి. 

జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీసెస్): కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు 3 సంవత్సరాల రెగ్యులర్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మెకానికల్/ ఆటోమొబైల్/ ఫైర్ లేదా 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి:

కనీస వయసు: 18 సంవత్సరాలు

గరిష్ట వయసు: 30 సంవత్సరాలు. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, భారతదేశ విమానాశ్రయ అథారిటీలో రెగ్యులర్ సర్వీసులో ఉన్న అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 12.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.1000. మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ మాజీ సైనికులు, ఏఏఐలో ఏదాది  అప్రెంటీస్‌షిప్ పూర్తి చేసిన వారికి మినహాయింపు ఉంటుంది.

లాస్ట్ డేట్: జనవరి 11. 

సెలెక్షన్ ప్రాసెస్
సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): కంప్యూటర్ ఆధారిత పరీక్ష,  డాక్యుమెంట్ వెరిఫికేషన్/ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
జూనియర్ అసిస్టెంట్ (హెచ్ఆర్): కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఎంఎస్ ఆఫీస్‌లో కంప్యూటర్ లిటరసీ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీసెస్):  కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ మెజర్​మెంట్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, శారీరక దారుఢ్య పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.aai.aero వెబ్​సైట్​లో సందర్శించండి.