ధర్పల్లి, వెలుగు : కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని రూరల్ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఆదివారం ధర్పల్లి రజక సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండేండ్ల కాంగ్రెస్‌పాలనలో ఎంతో అభివృద్ధి చేశామని, సీసీ రోడ్లు, తాగునీరు, బ్రిడ్జిలు, తారు రోడ్లకు నిధులు అందించినట్లు తెలిపారు.
రజక సంఘం కమ్యూనిటీ హాల్నిర్మాణం కోసం రూ.10 లక్షల నిధులు అందిస్తామన్నారు. ధర్పల్లి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి చెలిమెల శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు. బీసీ గణన నిర్వహించి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్‌ప్రభుత్వమేనని చెప్పారు.
పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్నిరంతరం కృషి చేస్తుందన్నారు. అనంతరం అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాల్రాజ్, కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్, సొసైటీ చైర్ పర్సన్ చిన్నారెడ్డి, పుప్పాల సుభాశ్, చెలిమెల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
