- ఇస్లామిక్ కొత్త సంవత్సర క్యాలెండర్ఆవిష్కరించిన ముస్లిం లీడర్లు
కోల్‌బెల్ట్, వెలుగు: రామకృష్ణాపూర్ పట్టణంలోని బిలాల్ మసీద్‌లో శుక్రవారం 2026 సంవత్సర ఇస్లామిక్ క్యాలెండర్‌ను కాంగ్రెస్ నేత, ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కమిటీ ప్రెసిడెంట్అబ్దుల్అజీజ్, ఏఐటీయూసీ నేత అక్బర్ అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు చేయడం అమానుషమని, ఈ ఘటనలను తమ కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
ఖురాన్, హదీసుల ప్రకారం ముస్లింలు తమ జీవితాన్ని గడపాలని, తోటి వారితో సఖ్యంగా ఉంటూ సుఖసంతోషాలతో గడపాలన్నారు. కార్యక్రమంలో బిలాల్ మస్జీద్ మోజన్ పాషా, సదర్ఆరిఫ్, మత పెద్దలు ఖాజా షరీఫ్, నజీర్, ఖాజా, ఇమ్రాన్, అన్వర్, నజీరోద్దిన్, అంకుశ్, పాషా, షబ్బీర్‌అలీ, ఇమ్రాన్తదితరులు పాల్గొన్నారు.
