BRS ఆఫీస్ ముట్టడిని వాయిదా వేసుకున్నాం: అద్దంకి దయాకర్

BRS ఆఫీస్ ముట్టడిని వాయిదా వేసుకున్నాం: అద్దంకి దయాకర్

కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై దాడిని ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ తీవ్రంగా ఖండించారు. అప్రజాస్వామికంగా కుట్రలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ఢిల్లీలో BRS పార్టీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చామన్నారు. ముట్టడి ప్రయత్నాల్లో ఉండగానే కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తల్ని అరెస్టులు చేసి.. ఎక్కడికి తీసుకెళ్లారో కూడా చెప్పలేదన్నారు. 

ఆ తర్వాత 41 CRPC కింద నోటీసులు ఇస్తున్నామని పోలీస్ అధికారులు స్పందించారని అద్దంకి తెలిపారు. దీంతో కొత్తగా ప్రారంభోత్సవం అవుతున్న BRS పార్టీ ఆఫీస్ ముట్టడిని వాయిదా వేసుకున్నామని చెప్పారు. గూండాలు, రౌడీల్లా కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై దాడులు చేశారని అద్దంకి దయాకర్ మండిపడ్డారు.