ఎన్ని ఇబ్బందులున్నా తెలంగాణ ఇచ్చాం.. హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ ఘనతే: చిదంబరం

ఎన్ని ఇబ్బందులున్నా తెలంగాణ ఇచ్చాం.. హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ ఘనతే: చిదంబరం

ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. మాట తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చెప్పారు. 2023, నవంబర్ 16వ తేదీ గురువారం హైదరాబాద్ గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మాట్లాడారు. తొమ్మిదిన్నర ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పు భారీగా పెరిగిందన్నారు. నిరుద్యోగం, అధిక ధరల నియంత్రణలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని విమర్శించారు.

కేసీఆర్ సర్కార్ విద్యకు కేటాయిస్తున్న నిధులు.. దేశ సగటు కన్నా చాల తక్కువగా ఉందని అన్నారు చిదంబరం. గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్ లోనే ఎక్కువ ఉందని చెప్పారు. రాష్ట్రంలో  ఖాళీగా ఉన్న 80వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు. తెలంగాణ అర్బన్ నిరోద్యోగిత దేశ సగటు కన్నా ఎక్కువగా ఉందని..  ప్రతి తెలగాణ పౌరుడిపై సగటునా లక్ష రూపాయల అప్పు చేశారని తెలిపారు.

 హామీ ఇచ్చి.. నిరుద్యోగ భృతి అమలు చేయలేదని మండిపడ్డారు.  తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆయన చెప్పారు.  రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సేనని.. హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ ఘనతే అని అన్నారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని..  అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని చిదంబరం చెప్పారు.

Also Read :- నవంబర్ 30 తరువాత బీఆర్ఎస్ కు భవిష్యత్ లేదు : భట్టి విక్రమార్క