ప్రతి హాస్టల్ ను సందర్శించి లోపాలను సరిచేయాలి

ప్రతి హాస్టల్ ను సందర్శించి లోపాలను సరిచేయాలి

ప్రభుత్వ హాస్టల్స్ లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో ఇబ్బందులు పడుతున్నారన్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పట్ల సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు. హెల్త్ మినిష్టర్ సొంత నియోజకవర్గంలో కూడా ఫుడ్ పాయిజన్ అయిందన్నారు. విద్యాశాఖ మంత్రి ప్రతి హాస్టల్ ను సందర్శించి లోపాలను సరిచేయాలన్నారు. NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హాస్టల్స్ ను పరిశీలించటానికి వెళ్తే దాడులు చేస్తున్నారని గీతారెడ్డి ఆరోపించారు.