శుక్రవారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. గాంధీ కుటుంబంలో ముగ్గురికి ఎంపీ పదవులు ఉండటం తప్పా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ కుటుంబం ప్రధాన పాత్ర పోషించిందని.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని అన్నారు జగ్గారెడ్డి. దేశాభివృద్ధిలో నెహ్రు, రాజీవ్, ఇందిరా గాంధీల పాత్ర కీలకమని అన్నారు. దేశంలో టెక్నాలజీ విప్లవానికి ఆద్యుడు రాహుల్ గాంధీ అని అన్నారు.
హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి రాజీవ్ పునాదులు వేశారని.. హైటెక్ సిటీకి నేదురుమల్లి హయాంలో శంకుస్థాపన చేశారని అన్నారు. పీవీ నరసింహారావును ప్రధానిని చేసింది కాంగ్రెస్సే అని అన్నారు. గాంధీ కుటుంబంపై లక్ష్మణ్ వ్యాఖ్యలు ఆయన అనుభవ రాహిత్యం, అవగాహనా లేమికి నిదర్శనమని అన్నారు. లక్ష్మణ్ కు చరిత్రను గౌరవించడం తెలియదని అన్నారు. లక్ష్మణ్ వయసు 69 ఏళ్ళు.. స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్ళు అవుతోందని.. అప్పటికి లక్ష్మణ్ పుట్టలేదని అన్నారు జగ్గారెడ్డి.
ALSO READ : డిసెంబర్ 13న హైదరాబాద్కు మెస్సీ..
కాంగ్రెస్ 140 ఏళ్ళ కిందట పుట్టిందని.. బీజేపీ 40 ఏళ్ళ కింద పుట్టిందని అన్నారు. మా చరిత్ర, బీజేపీ చరిత్రకు 100 ఏళ్ళ తేడా ఉందని అన్నారు జగ్గారెడ్డి. అర్హతలేని వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతలకు అలవాటు అయ్యిందని అన్నారు జగ్గారెడ్డి.
