అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో భూ సర్వే చేయిస్తాం: జైరాం రమేష్

అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో భూ సర్వే చేయిస్తాం: జైరాం రమేష్

తెలంగాణలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు ..వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని కాంగ్రెస్ నేత, ఏఐసీసీ కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. 2023, మార్చి 10న పెద్దపల్లి జిల్లా సుల్తాన్ పూర్ గ్రామంలో జరిగిన ధరణి అదాలత్ లో కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాబోయే రోజుల్లో మీ భూమి..మీ హక్కు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో ధరణిలో 60 లక్షల మంది పేర్లు ఉంటే దాదాపు 20 లక్షల ఖాతాల్లో సమస్యలు ఉన్నాయని తెలిపారు.  ధరణి పోర్టల్ ఉద్దేశం ఒకరి ఫోటో ఒకరికి పెట్టడం కాదు..ఎవరి భూములకు వారి హక్కులు కల్పించాలని జైరాం రమేష్ వెల్లడించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండేళ్లలో భూముల సర్వే చేయిస్తామని జైరాం రమేష్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో భూములకు సంబంధించి 125 చట్టాలు..30 వేల జీఓలు ఉన్నాయి..కానీ మేము ఒకే చట్టం తీసుకొస్తామన్నారు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం భూయజమాని అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితిలో సేకరించవద్దని చట్టం తీసుకొచ్చామని గుర్తు చేశారు. బలవంతంగా భూసేకరణ పూర్తిగా నిషేధిండమే కాకుండా చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని పేర్కొ్న్నారు.