కేటీఆర్ వ్యాఖ్యలన్నీ గాలి మాటలే : కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి

కేటీఆర్ వ్యాఖ్యలన్నీ గాలి మాటలే : కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి
  • కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి 

వీర్నపల్లి, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో చేసిన వ్యాఖ్యలు గాలి మాటలనేనని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. శనివారం వీర్నపల్లి మండల కేంద్రంలో మాట్లాడుతూ కేటీఆర్ అధికారం కోల్పోవడంతో గాలి మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్నా బాధ్యతగా పనిచేయని కేటీఆర్​ ఇప్పుడు ప్రజల సమస్యలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 

అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీర్నపల్లికి ఎన్నిసార్లు వచ్చాడో ప్రజలకు తెలుసన్నారు. అంతకుముందు భూక్య తండా, బావుసింగ్ నాయక్ తండా గ్రామాల్లో కొత్తగా నిర్మించిన శ్రీ జగదాంబ సేవలాల్‌‌‌‌‌‌‌‌ మహరాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ రాములు నాయక్, రాజు యాదవ్, చంద్రమౌళి, తిరుపతి పాల్గొన్నారు.