తెలంగాణ కోసం ముందుండి కొట్లాడింది కాంగ్రెస్ నేతలే: కోదండ రెడ్డి

తెలంగాణ కోసం ముందుండి కొట్లాడింది కాంగ్రెస్ నేతలే:  కోదండ రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనే ధరణి పోర్టల్ లో చాలా ఘోరాలు జరిగాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి. గాంధీ భవన్ లో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రావడానికి ముందుండి కొట్లాడింది కాంగ్రెస్ నేతలేనన్నారు. రాష్ట్రం వచ్చాకా ఒకే కుటుంబం అధికారంలో వుండి దోచుకుందని ఆరోపించారు. ధాన్యంకు అదనంగా రూ.500 బోనస్ అని చెప్పామని.. దాంతో క్వింటాల్ కు రూ.2060 వుండే.. ఇప్పుడు రూ.2600కు ధాన్యం అమ్ముకోడానికి అవకాశం దొరికిందన్నారు.

ఎస్ఎల్ బీసీ సమావేశం కాలేదు..అయినా తర్వాత ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని కోదండరెడ్డి చెప్పారు.హెచ్ఎండిఎ మొన్నటి వరకు కేటీఆర్ చేతుల్లోనే వుందని.. ఓఆర్ఆర్ విషయంలో అవకతవకలు జరిగాయని పీసీసీ హోదాలో వున్నప్పుడు రేవంత్ ఆరోపించారని గుర్తు చేశారు. దానిపై కూడా విచారణ చేపడుతున్నామని ఆయన చెప్పారు. ఏసీబీ విచారణలో హెచ్ఎండిఎ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ చాలా విషయాలు బయటపడుతున్నారని తెలిపారాయన. అరవింద్ కుమార్ కు బాలకృష్ణ డబ్బులు ఇచ్చిన విషయం చెప్పారని.. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను కూడా విచారించే అవకాశం ఉందన్నారు. 
 
ధాన్యం సేకరణ విషయంలో చాలా అక్రమాలు జరిగాయని.. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇన్వాల్ కూడా ఉందని తెలుస్తుందని చెప్పారు కోదండ రెడ్డి. మున్సిపల్, రెవెన్యూ శాఖల్లో అవినీతికి కేసీఆరే బాధ్యత వహించాలని.. మున్సిపల్ శాఖలో టీడీఆర్ తీసుకొచ్చి దోచుకున్నారని ఆరోపించారు. సోమాజిగూడలోని 184,185 సర్వే నెంబర్లలో రూ.42 కోట్లు దోచుకున్నారని.. బీఆర్ఎస్ హయాంలో భూ కుంభకోణాలు జరిగాయన్నారు కోదండరెడ్డి.