పార్టీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవు

పార్టీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవు

పార్టీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్. హైదర్ గూడ ఎమ్మెల్యే క్వాటర్స్ లో మాణిక్కం ఠాగూర్ ని కలిశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నిన్న జరిగిన  నాగార్జున సాగర్ సభ, పీఏసీ మీటింగ్ లకు రాకపోడవంపై మాణిక్కం ఠాగూర్ కు వివరణ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై నోకామెంట్స్ అంటూ.. ఇద్దరి మధ్య జరిగిన భేటీ గురించి స్పందించారు మాణిక్కం ఠాగూర్. కోమటిరెడ్డి స్టార్ క్యాంపెయినర్ అని.. ఉదయం వచ్చి కలిశారన్నారు. నేతలందరూ రాహుల్ గాంధీ సభ సన్నాహాల్లో బిజీగా ఉన్నారన్నారు. సభ ఏర్పాట్లు చూసేందుకు వరంగల్ కు వెళ్తున్నట్లు తెలిపారు మాణిక్కం ఠాగూర్.