మంత్రులు అవినీతితో ఆస్తులు పెంచుకుంటున్నరు

మంత్రులు అవినీతితో ఆస్తులు పెంచుకుంటున్నరు

రాష్ట్రం వచ్చాక జరుగుతున్న అవినీతిపై కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్​ మండిప్డడారు. ఇవాళ ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రాజెక్ట్​ల పేరుతో కేసీఆర్ ​ఆంధ్రోళ్లకు దోచిపెడుతున్నారన్నారు. టీఆర్ఎస్ ​నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ వారి అస్తులు పెంచుకుంటున్నారని ఆరోపించారు. కాళేశ్వరం పాజెక్టు పేరుతో వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ప్రజలకు ప్రశ్నించే అధికారం లేకుండా టీఆర్ఎస్​ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అణచివేస్తున్నారన్నారు. కేసీఆర్ ​తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది.. తన వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడానికి, తన బంధువులకు పదవులు కట్టబెట్టడానికే అని ఫైర్ ​అయ్యారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్​ను అరెస్టు చేస్తే కల్వకుంట్ల కుంటుంబం చేసిన అవినీతి భాగోతం బయటకొస్తుందన్నారు. టీఆర్ఎస్​ ఎమ్మెలేలు,మంత్రులు అవినీతి చేసి భవనాలు కట్టించుకుంటున్నారని... కానీ పేద ప్రజలకు ఇంతవరకూ డబుల్ ​బెడ్​రూం ఇళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ ​చేసే అవినీతితో మొత్తం తెలంగాణకే నష్టం జరుగుతుందన్నారు. ఈ అవినీతిపై ముఖ్యమంత్రి కేసీఆర్​ను ప్రశ్నించే బాధ్యత మనందరిపై ఉందన్నారు.