
బీజేపీ తెలంగాణ ప్రజలకు ఏవిధంగా ఉపయోగపడుతుందో మర్రి శశిధర్ రెడ్డి చెప్పాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ వచ్చిందని చెప్పడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ వస్తే ఇలానే వదిలేస్తారా అని ప్రశ్నించారు. కేంద్రం ED, IT, CBI ద్వారా దాడులు చేయిస్తూ భయాందోళకు గురిచేస్తోందని ఆరోపించారు.
విభజన హామీలను బీజేపీ ఎందుకు నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల DNAలో ఉందని.. ఎవరో చంపితే చావదని మల్లు రవి వెల్లడించారు. కాగా, రేపు రాష్ట్ర బీజేపీ నేతల వెంట మర్రిశశిధర్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఈనెల 25న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో కమల దళంలోకి చేరనున్నారు.