
హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి. ప్రస్తుతం కడుతున్న ఇళ్ల నిర్మాణ పనులు కూడా నెమ్మదిగా సాగుతున్నాయన్నారు. నక్లెస్ రోడ్ లోని అంబేద్కర్ బస్తీలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను లబ్దిదారులతో కలిసి పరిశీలించారు. ఏడాదిలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా ఎక్కడా పనులు పూర్తికాలేదన్నారు. బస్తీ వాసులు ఉన్న ఇళ్లను వదులుకొని బయట కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు శశిధర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద ఆర్థిక సాయం కూడా అర్హులైన వారికి అందడం లేదని చెప్పారు.