బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు నన్నడగొద్దు: కవిత

బీఆర్ఎస్ ను ఇబ్బంది  పెట్టే  ప్రశ్నలు నన్నడగొద్దు: కవిత
  • = పార్టీ పదవులు ఓబీసీలకు ఇస్తరా అన్న ప్రశ్నపై కవిత
  • లోకల్ బాడీ ఎన్నికల్లో బీఅర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తది
  • ప్రాంతీయ పార్టీలతోనే బీసీలకు మేలు
  •  ఢిల్లీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఢిల్లీ: బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలను తనన అడగొద్దన్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ పార్టీలో  పదవులు ఓబీసీలకు ఇస్తారా..? అన్న ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం చెప్పారు. పార్టీలో పదవులు కొందరికే లబ్ధి చేకూర్చుతాయని, సమాజంలో  రిజర్వేషన్లు వ్యవస్థ మొత్తానికి లాభం చేకూర్చుతాయని  చెప్పారు. ఇవాళ ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బిల్లు పాసైనందున కాబట్టి గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే రిజర్వేషన్లు అమలులోకి వస్తాయన్నారు. సీఎం  రేవంత్ రెడ్డి తెలంగాణలో కన్నా ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ సీఎం ను పిలిపించుకోని మాట్లాడి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేలా కృషి చేయాలని అన్నారు.  

42 శాతం బిల్లును పాస్ చేయకపోతే బీజేపీకి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు.  బిల్లు కేంద్రం ఆమోదం తెలపకపోయిన, రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వకపోయినా జులై 17 న రైల్ రోకో నిర్వహిస్తామని, దక్షిణాది నుంచి ఢిల్లీకి రైళ్లను రానివ్వబోమని చెప్పారు. ప్రస్తుతానికి ఒక్క రోజే రైల్  రోకో చేస్తామని, భవిష్యత్ లో  నిరవధికంగా  నిర్వహిస్తామని అన్నారు.  8 మంది బీజేపీ ఎంపీలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేం లేదని చెప్పారు.  కులగణనలో డేటా శాస్త్రీయంగా లేదని,  ఎస్సీ, ఎస్టీ ల జనాభాలో ఒక్కశాతం పెరుగుదల ఉండటం, ఓసీలలో 6 నుంచి 7% ఎక్కువ కావడం సందేహాలున్నాయన్నారు.  ప్రాంతీయ పార్టీలతోనే బిసిలకు మేలు జరుగుతుందని కవిత అభిప్రాయపడ్డారు. రైలురోకో మద్దతు కోరుతూ రేపు అన్నిపార్టీలకు లేఖలు రాస్తానని చెప్పారు.