
సెక్రటేరియట్ లో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిశారు జర్మనీ ప్రభుత్వ ప్రతినిధులు. తెలంగాణ నర్సింగులకు జర్మనీలో ఉపాధి కల్పించే ట్రిపుల్ విన్ కార్యక్రమంపై చర్చించారు జర్మనీ ప్రతినిధులు. నర్సులతో పాటు ఐటీఐ విద్యార్థులకు జర్మనీల ఉపాధికల్పించాలని వారికి సూచించారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
జులై 9 నుంచి జులై 17 నర్సులకు బేగంపేటలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎంపికైన నర్సులకు జర్మనీలో ఉద్యోగం కల్పించనున్నారు.
వైద్యశాఖలో ప్రమోషన్స్
మరో వైపు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లకు ప్రభుత్వం రెగ్యులర్ పద్ధతిలో పరిపాలనాధికారులను నియమించింది ప్రభుత్వం. 44 మంది సీనియర్ ప్రొఫెసర్ల కు అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు గా పదోన్నతి కల్పిస్తూ జీవో జారీ చేసింది. వారందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్ ,టీచింగ్ హాస్పిటళ్లకు సూపరింటెండెంట్లు గా నియమించింది. ఇటీవల 607 అస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటికి తోడు అదనంగా మరో 714 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.