BAN vs PAK: బాబర్, రిజ్వాన్, అఫ్రిది‌లపై వేటు.. బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌కు పాకిస్థాన్ జట్టు ప్రకటన

BAN vs PAK: బాబర్, రిజ్వాన్, అఫ్రిది‌లపై వేటు.. బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌కు పాకిస్థాన్ జట్టు ప్రకటన

జూలై 20 నుంచి మీర్పూర్‌ వేదికగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం బంగ్లాదేశ్ లో పాకిస్థాన్ పర్యటించబోతుంది. 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మంగళవారం (జూలై 8) 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. సల్మాన్ అఘా పాక్ జట్టును నడిపించనున్నాడు. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిదిలను మరోసారి టీ20 జట్టు నుండి తొలగించారు. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఈ త్రయంపై తొలిసారి వేటు పడింది. బంగ్లాతో ఛాన్స్ దక్కుతుందని భావించినా పాక్ బోర్డు కుర్రాళ్ల వైపే మొగ్గు చూపింది. 

ALSO READ | Wimbledon 2025: ఈ సారి ఫైనల్‌కు ఆ ఇద్దరూ రావాలి.. కానీ అతడే గెలవాలి: విరాట్ కోహ్లీ

గాయాల కారణంగా స్టార్ క్రికెటర్లు షాదాబ్ ఖాన్, ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండడం లేదు. టీ20 జట్టుకు వైస్ కెప్టెన్ అయిన షాదాబ్ భుజం గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకొని సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం షాదాబ్ పునరావాసంలో ఉన్నాడు. అతను పూర్తి ఫిట్ నెస్ సాధించడానికి మరికొంత సమయం కావాలి. మరోవైపు పాక్ స్టార్ పేసర్ రౌఫ్ హార్మ్ స్ట్రింగ్ గాయంతో బాధపడుతున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ లో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ జట్టు తరపున ఆడుతూ ఈ పాక్ పేసర్ గాయపడ్డాడు. రౌఫ్ మళ్ళీ ఎప్పుడు మైదానంలో అడుగుపెడతాడో ఎలాంటి క్లారిటీ లేదు. 

ఇర్ఫాన్ ఖాన్, హసన్ అలీ, మహ్మద్ వసీం, నసీమ్ షాల లాంటి సీనియర్లను సైతం జట్టు నుండి తొలగించారు. వీరి బదులుగా పొట్టి ఫార్మాట్‌లో అద్భుతంగా ఆడుతున్న యువ క్రికెటర్లకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చింది. అన్‌క్యాప్డ్ పేసర్లు అహ్మద్ డానియల్, సల్మాన్ మీర్జాలను ఈ సిరీస్‌కు ఎంపిక చేసింది. వీరితో పాటు సుఫియాన్ ముఖీమ్, టాప్ ఆర్డర్ బ్యాటర్ హసన్ నవాజ్ కూడా ఉన్నారు. ఫాస్ట్ బౌలర్ అబ్బాస్ అఫ్రిది కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు.

బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు

సల్మాన్ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, ఫహీమ్ అష్రఫ్ , ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, సుఫీయం మోకీమ్     సలీమ్, సలీమ్, సలీమ్),