Wimbledon 2025: ఈ సారి ఫైనల్‌కు ఆ ఇద్దరూ రావాలి.. కానీ అతడే గెలవాలి: విరాట్ కోహ్లీ

Wimbledon 2025: ఈ సారి ఫైనల్‌కు ఆ ఇద్దరూ రావాలి.. కానీ అతడే గెలవాలి: విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, టెన్నిస్ లెజెండ్ నోవాక్ జోకొవిచ్ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. వీరిద్దరూ కలవకపోయినా 2024 జనవరిలో వీడియో ద్వారా వీరు గతంలో మాట్లాడుకున్నారు. కోహ్లీ వన్డేల్లో 50వ సెంచరీ చేసినప్పుడు కూడా జొకోవిచ్ తన ఇన్‌స్టా స్టోరీలో జొకోవిచ్ అభినందనలు తెలిపాడు. అంతేకాదు కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో "ఇన్క్రెడిబుల్ ఇన్నింగ్స్" అని జొకోవిచ్ ప్రశంసించాడు. ఇక వీరిద్దరి మధ్య ఉన్న స్పెషల్ బాండ్ కొనసాగుతోంది. 

ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ జరుగుతుంది. సోమవారం (జూలై 7) 24 గ్రాండ్ స్లామ్స్ వీరుడు నోవాక్ జొకోవిచ్ వింబుల్డన్ మ్యాచ్ చూడడానికి విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మతో కలిసి హాజరయ్యారు. సెంటర్ కోర్ట్ రౌండ్ ఆఫ్ 16లో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో డి మినౌర్‌పై 1-6, 6-4, 6-4, 6-4 తేడాతో జొకోవిచ్ విజయం సాధించాడు. ఈ మ్యాచ్ లో వెనకపడినప్పటికీ జొకోవిచ్ పుంజుకున్న తీరు కోహ్లీకి బాగా నచ్చింది. దీంతో మ్యాచ్ తర్వాత జొకోవిచ్ ను కోహ్లీ ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు.  అద్భుతమైన మ్యాచ్.. ఇలాంటి మ్యాచ్ లు జొకోవిచ్ కే సాధ్యమంటూ కోహ్లీ తన ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేసాడు.

మ్యాచ్ తర్వాత కోహ్లీ జొకోవిచ్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ పై స్పందించాడు. " నేను కొంతకాలంగా నోవాక్‌తో టచ్‌లో ఉన్నాను. మేము ఒకరికొకరం మెసేజ్ లు చేసుకుంటాం. ఈ వింబుల్డన్ ఫైనల్స్ లో నోవాక్, కార్లోస్ ఫైనల్స్‌లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. బహుశా నోవాక్ ఈ టైటిల్ గెలవాలని కోరుకుంటున్నాను. టైటిల్ సాధిస్తే జొకోవిచ్ కెరీర్ లో ఇది అత్యంత గొప్ప విషయం అవుతుంది. అతను అన్ని జనరేషన్స్ లో గొప్పవాడు. ప్రస్తుతం నంబర్ వన్ కాకపోయినా, అత్యధిక గ్రాండ్ స్లామ్స్ సాధించిన వ్యక్తి. అతను ఫైనల్స్‌లో కార్లోస్‌తో ఆడాలని మరియు అతను గెలవాలని నేను నిజంగా కోరుకుంటున్నాను". అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ALSO READ : ఆస్ట్రేలియా టూర్‌కు ఇండియా.. నాలుగు నెలలకు ముందే టికెట్స్ ఖతం

ఆగస్టు నెలలో బంగ్లాదేశ్ తో జరగనున్న వన్డే సిరీస్ వాయిదా పడడంతో కోహ్లీ టీమిండియా తరపున అక్టోబర్ 19 న ఆడనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా 3 వన్డేలు ఆడనుంది. మరోవైపు డి మినౌర్‌పై నాలుగో రౌండ్ లో గెలిచిన జొకోవిచ్.. వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్ లో తబిలోతో జొకోవిచ్ తలపడాల్సి ఉంది.