IND vs AUS: ఆస్ట్రేలియా టూర్‌కు ఇండియా.. నాలుగు నెలలకు ముందే టికెట్స్ ఖతం

IND vs AUS: ఆస్ట్రేలియా టూర్‌కు ఇండియా.. నాలుగు నెలలకు ముందే టికెట్స్ ఖతం

బంగ్లాదేశ్ తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్ టీమిండియా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సిరీస్ ఆడేందుకు బంగ్లా బోర్డు సిద్ధంగా ఉన్నప్పటికీ టీమిండియాను పంపేందుకు భారత కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ సిరీస్ సెప్టెంబర్ 2026 కు వాయిదా పడింది. బంగ్లాతో సిరీస్ పోస్ట్ పోన్ కావడంతో భారత్ తర్వాత ఆడబోయే సిరీస్ గురించి చర్చ మొదలైంది. ముఖ్యంగా వన్డే, టీ 20 సిరీస్ పై అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే టీమిండియా వైట్ బాల్ సిరీస్ కోసం మరో నాలుగు నెలలు ఎదురు చూడాల్సిన పరిస్థితి.

టీమిండియా తమ తదుపరి వన్డే, టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో ఈ మెగా సిరీస్ ప్రారంభమవుతుంది. భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ ఈ సిరీస్ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉండడం విశేషం. క్రికెట్ ఆస్ట్రేలియా (CA) ఇప్పటికే ఎనిమిది మ్యాచ్‌లకు 90,000 కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడయ్యాయి.  సిడ్నీలో జరగబోయే మూడో వన్డేతో పాటు కాన్‌బెర్రాలో జరిగే తొలి టీ20కి టికెట్స్ పూర్తిగా అమ్ముడయ్యాయానని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది.  

►ALSO READ | మా గోడు వినరా.. ఏకపక్షంగా తీర్పు ఎలా ఇస్తారు..? క్యాట్ తీర్పును హైకోర్ట్‎లో సవాల్ చేసిన ఆర్సీబీ

మెల్ బోర్న్, గబ్బాల్లో జరగబోయే టీ20 మ్యాచ్ కు సైతం ఎక్కువగా టికెట్స్ అమ్ముడు పోయాయయని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.   CA ప్రకారం, ఇప్పటివరకు అమ్ముడైన టిక్కెట్లలో 16 శాతానికి పైగా భారతీయ అభిమానుల సంఘాలు కొనుగోలు చేశాయి. 2020 తర్వాత ఇండియా తొలిసారి వైట్ బాల్ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో టూర్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న అడిలైడ్ లో రెండో వన్డే.. అక్టోబర్ 25 న సిడ్నీలో మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది.

అక్టోబర్ 29 న మనుకా ఓవల్ లో తొలి టీ20 ప్రారంభమవుతుంది. కోహ్లీ, రోహిత్ లను ఇకపై ఆస్ట్రేలియాలో చూడబోతున్నాం. 2027లో సౌతాఫ్రికా వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ కు వీరిద్దరూ ఆడి తమ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతుంది.