
సమ్మెకు తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష మంది
బషీర్బాగ్, వెలుగు: జులై 9న జరుగనున్న దేశవ్యాప్త సమ్మెలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బ్యాంకులు, ఇన్సూరెన్స్రంగాలకు చెందిన దాదాపు లక్ష మంది పాల్గొననున్నట్లు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జాయింట్ ఫోరం ఆఫ్ ఫైనాన్సియల్ సెక్టార్ యూనియన్స్(జెఎఫ్ఎఫ్ ఎస్యూ) ప్రకటించింది.
హైదరాబాద్ కోఠిలో బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ సంస్థల ఉద్యోగులు, అధికారుల యూనియన్లతో జెఎఫ్ఎఫ్ఎస్యూ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం నేత బి.ఎస్.రాంబాబు మాట్లాడుతూ.. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే నిరవధిక సమ్మె చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సమద్ ఖాన్, ఫణికుమార్, రవీంద్రనాథ్, సతీశ్తదితరులు పాల్గొన్నారు.