Rajinikanth Coolie : లోకేష్ 'కూలీ'లో రజినీకాంత్ Vs నాగార్జున: ఆమిర్ ఖాన్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్!

 Rajinikanth Coolie : లోకేష్ 'కూలీ'లో రజినీకాంత్ Vs నాగార్జున: ఆమిర్ ఖాన్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్!

దర్శకుడు లోకేష్ కనగరాజ్ ( Lokesh Kanagaraj ) తెరకెక్కిస్తున్న హై-యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కూలీ' ( Coolie ) పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమాలో సూపర్‌స్టార్ రజినీకాంత్( Rajinikanth ) ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  అయితే, తాజాగా వచ్చిన ఒక అధికారిక ప్రకటనతో ఈ సినిమాపై ఆసక్తి మరింత రెట్టింపు చేస్తోంది. అదేంటంటే, ఈ చిత్రంలో రజినీకాంత్‌తో తలపడనున్న ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కింగ్ అక్కినేని నాగార్జున ( Nagarjuna Akkineni )  నటిస్తున్నారని స్వయంగా ఆయనే ధృవీకరించారు!

రజనీకాంత్ Vs నాగార్జున
నాగార్జున ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ, "ఈ సినిమాలో నేను రజినీకాంత్ సర్‌కు వ్యతిరేకంగా నటిస్తున్నాను. ఇది నాకు చాలా విభిన్నమైన అనుభవం, చాలా సరదాగా ఉంది" అని తెలిపారు. 'కూలీ' చిత్రంలో రజినీకాంత్, నాగార్జునల మధ్య ముఖాముఖి పోరాటం ఉంటుందని చాలా కాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో తెరపడింది. దీంతో ఈ సినిమాకు ఇది ఒక భారీ హైప్‌ను తెచ్చిపెట్టింది. అటు రజినీ, నాగ్ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.


ఆమిర్ ఖాన్ ఎంట్రీ: ఊహించని ట్విస్ట్!
అంతేకాకుండా, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన అతిథి పాత్రలో నటిస్తున్నారని నాగార్జున వెల్లడించారు. అయితే, ఆమిర్ ఖాన్‌తో తనకు స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం లేదని,  వారి పాత్రలు వేర్వేరుగా ఉంటాయని తెలిపారు. ఆమిర్ నటనను చూశాను.. ఈ చిత్రంలో  ఆయనను పూర్తిగా కొత్త కోణాంలో చూస్తారు. అది అందరికి షాక్ ఇస్తుంది" అని నాగార్జున పేర్కొన్నారు.  సినిమా చివరి 15 నిమిషాల్లో ఒక హై-వోల్టేజ్ సీక్వెన్స్‌లో ఆమిర్ ఖాన్ కనిపించనున్నట్లు టాక్. ఈ సన్నివేశాల్లో రజినీకాంత్, ఆమిర్ ఖాన్ ( Aamir Khan) ఇద్దరూ కలిసి నటించనున్నారని, ఇది తీవ్రమైన సంభాషణలు, ఉత్కంఠభరితమైన యాక్షన్‌తో నిండి ఉంటుందని సమాచారం.  ఈ యాక్షన్ సన్నివేశాలను రాజస్థాన్‌లో చిత్రీకరించినట్లు, దీని కోసం ఆమిర్ 10 రోజుల షూటింగ్ షెడ్యూల్‌ను కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి.

భారీ తారాగణం, భారీ బడ్జెట్
'కూలీ' చిత్రంలో రజినీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్‌లతో పాటు శృతి హాసన్, ఉపేంద్ర రావు, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, రెబా మోనికా జాన్ వంటి బలమైన తారాగణం ఉంది. ఇది లోకేష్ కనగరాజ్, రజినీకాంత్‌ల మొదటి కలయిక.  దాదాపు  రూ. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.  లోకేష్ కనగరాజ్ 'కూలీ' కోసం గత రెండేళ్లుగా నిరంతరం కృషి చేస్తున్నారని, తన కుటుంబం, స్నేహితులకు కూడా సమయం కేటాయించలేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తన 36, 37వ పుట్టినరోజులను కూడా షూటింగ్‌లోనే గడిపానని చెప్పారు.  మరి 'కూలీ' చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  ఇప్పటికే ఈ మూవీని 100 దేశాల్లో విడుదల చేయాలని భారీగానే ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు హృతిక్ రోషన్ ( Hrithik Roshan ) , జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR ),  నటించిన 'వార్ 2' ( War 2 )  కూడా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొననుంది.  మరి బాక్సాఫీస్ వద్ద ఎవరు విజయం సాధిస్తారో చూడాలి మరి. 

►ALSO READ | Rashmika Mandanna: రష్మికపై నిప్పులు చెరిగిన కొడవ నటీనటులు.. అసలేం జరిగింది?