ఈ 17 రకాల ట్యాబ్లెట్లు బయట పడేస్తున్నారా..? వద్దు వెరీ డేంజర్.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే..!

ఈ 17 రకాల ట్యాబ్లెట్లు బయట పడేస్తున్నారా..? వద్దు వెరీ డేంజర్.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే..!

చాలా మంది ఇండ్లలో ఉపయోగించని రకరకాల ట్యాబ్లట్లు ఉంటాయి. ఎప్పుడో తెచ్చి వాటిని ఉపయోగించకపోవడం వల్ల అవి ఎక్స్‎పైరీ అయిపోతాయి. ఆ తర్వాత వాటిని బయటపడేస్తుంటాం. కానీ ఇలా గడువు ముగిసిన మందులను బయట పడేయటం ప్రమాదమని హెచ్చరిస్తోంది సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO). ఎక్స్‎పైరీ అయిన మందులను బయట పడేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని చెప్తోంది. 

ALSO READ | heart attacks:సైలెంట్ హార్ట్ అటాక్..ఏ లక్షణాలు ఉండవు..చాలా డేంజర్..డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

ఎందుకంటే బయటపడేసే ఎక్స్‎పైరీ మందులు ప్రజలు, జంతువులు, పక్షులు, పర్యావరణానికి హాని కలిగిస్తాయంట. ఇందులో ముఖ్యంగా 17 రకాల ట్యాబ్లట్లు అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది CDSCO. గడువు ముగిసిన తర్వాత ఈ 17 రకాల ఔషదాలను బయటపడేస్తే చాలా ప్రమాదమంట. ఎక్స్‎పైరీ అయిన మందులను బయటపడేయడం కాకుండా టాయిలెట్‌లో ఫ్లష్ చేయడం మంచిదని సూచించిందిసెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. 

17 రకాల ట్యాబెట్ల జాబితా:

  • ఫెంటానిల్
  • ఫెంటానిల్ సిట్రేట్
  • డయాజెపామ్
  • బుప్రెనార్ఫిన్
  • బుప్రెనార్ఫిన్ హైడ్రోక్లోరైడ్
  • మార్ఫిన్ సల్ఫేట్
  • మెథడోన్ హైడ్రోక్లోరైడ్
  • హైడ్రోమోర్ఫోన్ హైడ్రోక్లోరైడ్
  • హైడ్రోకోడోన్ బిటార్ట్రేట్
  • టాపెంటాడోల్
  • ఆక్సికోడోన్ హైడ్రోక్లోరైడ్
  • ఆక్సికోడోన్
  • ఆక్సిమోర్ఫోన్ హైడ్రోక్లోరైడ్
  • సోడియం ఆక్సిబేట్
  • ట్రామాడోల్
  • మిథైల్ఫెనిడేట్
  • మెపెరిడిన్ హైడ్రోక్లోరైడ్

పై జాబితాలోని మందులను గడువు ముగిసిన తర్వాత లేదా అవి అవసరం లేనప్పుడు బయటపడేయడం కంటే ఫ్లష్ చేయడం సురక్షితం. ఎందుకంటే ఈ ట్యాబ్లట్లు దుర్వినియోగం జరిగితే చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అంతేకాకుండా ఈ మందులను అనారోగ్యానికి గురైన వ్యక్తి కాకుండా వేరే ఎవరైనా తీసుకుంటే చాలా ప్రమాదమని, కొన్నిసార్లు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది CDSCO. 

ఇంట్లోని ఎక్స్ పైరీ మందులు ఉండటం వల్ల పెంపుడు జంతువులకు కూడా ప్రమాదమేనని.. అందుకే గడువు తీరిన ట్యాబ్లట్లను వెంటనే ప్లష్ చేయాలని సూచించింది సీడీఎస్‎సీవో. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి "డ్రగ్ టేక్ బ్యాక్" కార్యక్రమాల ద్వారా ఇతర ఔషధాలను శాస్త్రీయంగా పారవేయడంపై CDSCO అవగాహన కల్పిస్తోంది. ఎక్స్‎పైరీ మందులు బయటపడేయడం వల్ల భూగర్భ జలాల్లోకి చేరి అనేక వ్యాధులు సంక్రమించడానికి కారణమవుతోందట. అందుకే గడువు తీరిన మందులను బయట పడేయకుండా ఇంట్లోనే టాయిలెట్లో ప్లష్ చేయాలని సూచించింది సీడీఎస్‎సీవో