రైతు ఉద్యమానికి కేసీఆర్ మద్దతు ఇవ్వలేదు

రైతు ఉద్యమానికి కేసీఆర్ మద్దతు ఇవ్వలేదు

తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. రైతు ఉద్యమానికి కేసీఆర్ మద్దతు తెలపలేదన్నారు ఆమె. నల్ల చట్టాలకు ఇతర రాష్ట్రలు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తే కెసిఆర్ పట్టించుకోలేదన్నారు. 10రోజులు ఢిల్లీలో ఉండి టీఆర్ఎస్ పార్టీ భవనానికి శంకుస్థాపన చేసిన కెసిఆర్, రైతు పోరాటానికి మద్దతు మాత్రం తెలపలేదన్నారు. రైతులను దళారీలు దోచుకుంటుంటే.. కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు సీతక్క. కెసిఆర్ ఫార్మ్ హౌస్ లో క్యాప్సికం, అల్లం పండించి ఎకరానికి కోటి రూపాయల ఆదాయం వస్తే ఆ టెక్నిక్ రైతులకు ఎందుకు చెప్పారంటూ ఆమె ప్రశ్నించారు.

ఈ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. రైతులు కార్పొరేట్ శక్తులను అడ్డుకున్నందునే వడ్లు కొనడం లేదని ఆరోపించారు సీతక్క. 18 నెలలుగా మొక్కవోని పోరాటంతో రైతులు మోడీ మెడలు వంచారన్నారు. దాన్ని ఓర్వలేకనే వడ్లు కొనం అంటూ డ్రామాలు చేస్తున్నారన్నారు సీతక్క. కౌలు రైతులకు నష్టాలూ వస్తే పట్టించుకునే నాధుడే లేడన్నారు. దేశానికి అన్నం పెట్టె రైతులను అరిగోస పెట్టినోల్లు బాగుపడరన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఎన్నికలు ఉన్నందునే చట్టాలను రద్దు చేస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. 

ఓవైసీ మోడీ వేర్వేరు కాదని విమర్శించారు సీతక్క. హిందువుల పేరుతో మోడీ, ముస్లింల పేరుతో ఓవైసీ రెచ్చగొడుతున్నాన్నారు. మూడవ కూటమి అనే కెసిఆర్ ను నమ్మేవారు లేరన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. అంబానీ, ఆదానీలకు ప్రభుత్వ ఆస్తులను అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారు రైతులే కాదని, రైతులకు సమస్యలే లేవు అంటూ ప్రభుత్వం బుకాయిస్తుందన్నారు సీతక్క