హిందూ దేవాలయాలకు బండి సంజయ్ ఏం చేశాడు

హిందూ దేవాలయాలకు బండి సంజయ్ ఏం చేశాడు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జోకర్ గా మారాడని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 9 నుంచి 18 వరకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పాదయాత్ర చేస్తున్నా అని తెలిపారు. ప్రభుత్వ నియంతృత్వ విధానాలను ఎండగడతామన్నారు. 

ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో సమస్యలపై పోరాడతామని వ్యాఖ్యానించారు. మిడ్ మానేరు, రాజన్న ఆలయం, మెడికల్ కాలేజి హామీలు నెరవేరలేదని ఆరోపించారు. కాగా, హిందూగాళ్ళు బొందుగాళ్ల ప్రచారంతో బండి సంజయ్ గెలిచాడు.. హిందూ దేవాలయాలకు సంజయ్ ఏం చేశాడని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.