జవాన్ల మరణాలు ఇంకెంత కాలం..?: ప్రియాంక గాంధీ ఆవేదన

జవాన్ల మరణాలు ఇంకెంత కాలం..?: ప్రియాంక గాంధీ ఆవేదన

న్యూఢిల్లీ: దోడా జిల్లాలో జరిగిన టెర్రర్  దాడిపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ఆమె సానుభూతి తెలిపారు. అమరుల త్యాగాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ట్వీట్  చేశారు. అయితే, ఇంకెంతకాలం అమరుల భౌతికకాయాలు లెక్కిస్తూ ఉండాలని ఆమె ప్రశ్నించారు. 

‘‘జమ్మూకాశ్మీర్​లో టెర్రరిజాన్ని నిర్మూలించామని కేంద్రం చెబుతోంది. మరి ఈ ముష్కరులు ఎక్కడి నుంచి వస్తున్నారు? మన సైనికులు ఎలా అమరులవుతున్నారు? కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా అబద్ధాలకు సైనికులు బలవుతున్నారు. అటాక్  జరిగిన ప్రతీసారి సంతాపం తెలపడం వరకే కేంద్ర నాయకత్వం పరిమితం కావాల్నా?  టెర్రరిజానికి వ్యతిరేకంగా అందరూ నిలబడాలి” అని ప్రియాంక ట్వీట్  చేశారు.