నేనేం నేరం చేశా? గుడిలోకి వెళ్లకుండా .. రాహుల్ ను అడ్డుకున్న పోలీసులు

నేనేం నేరం చేశా?  గుడిలోకి వెళ్లకుండా ..  రాహుల్ ను అడ్డుకున్న పోలీసులు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. భారత్ జోడో న్యాయ యాత్ర ఉన్న రాహుల్ .. 15వ శతాబ్దానికి చెందిన అస్సామీ సన్యాసి, పండితుడు శ్రీమంత శంకరదేవ జన్మస్థలమైన నాగావ్‌లోని బటడ్రావ సత్ర ఆలయాన్ని సందర్శించకుండా పోలీసులు అడ్డుకున్నారు.  దీంతో పోలీసులతో  రాహుల్ వాగ్వాదానికి దిగారు.  
.
నేను ఎందుకు లోపలికి వెళ్లకూడదు.. నేనేం తప్పు చేశాను. నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు. మేము ఎటువంటి సమస్యలను సృష్టించాలని అనుకోవడం లేదు...  ఆలయంలో పూజలు చేయాలని అనుకుంటున్నామని పోలీసులతో రాహుల్ చెప్పారు.  అయితే మధ్యాహ్నం 3 గంటల తరువాతే ఆలయం లోపలికి పంపిస్తామని రాహుల్ కు  పోలీసులు వెల్లడించారు.  దీంతో గుడిలోకి ఎవరు ప్రవేశించాలనేది ఇప్పుడు ప్రధాని మోదీ నిర్ణయిస్తున్నారని రాహుల్ కామెంట్ చేశారు.  

అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన వేడుకతో ఘర్షణలు జరగవచ్చనని  ఆందోళన వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ తన యాత్ర మార్గంపై ఒకసారి పునరాలోచించుకోవాలని ఆదివారం ఆయన్ను  అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కోరారు. కాగా  అస్సాంలోని 17 జిల్లాల మీదుగా 833 కి.మీ. మేర జనవరి 25 వరకు రాహుల్‌ యాత్ర కొనసాగనుంది.