దేశాన్ని నలుగురు వ్యక్తులే నడిపిస్తున్నారు

దేశాన్ని నలుగురు వ్యక్తులే నడిపిస్తున్నారు

న్యూఢిల్లీ: దేశాన్ని నలుగురు వ్యక్తులే నడిపిస్తున్నారని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యసభలో కొత్త వ్యవసాయ చట్టాలపై రాహుల్ ఫైర్ అయ్యారు. మార్కెట్లను ఖతం చేసేందుకే మొదటి అగ్రి చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. రెండో చట్టం ఉద్దేశం ఎంఎస్‌పీ తొలగించడమని, కనీస మద్దతు ధర (ఎంఎస్‌‌పీ) వ్యవస్థను అంతం చేసేందుకే వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని ఆరోపించారు.

‘కొత్త అగ్రి చట్టాల అమలుతో రైతులు తమ భూములు కోల్పోతారు. వారికి మద్దతు ధర లభించదు. చాలా ఏళ్ల తర్వాత దేశంలో తిరిగి ఆకలి చావుల పరిస్థితి ఏర్పడుతుంది. వీటి అమలుతో రూరల్ ఎకానమీ పూర్తిగా పడిపోతుంది. చిన్నచిన్న దుకాణాలు మూసుకుపోతాయి. ఫుడ్ సెక్యూరిటీ సిస్టమ్ పూర్తిగా ధ్వంసం అవుతుంది’ అని రాహుల్ చెప్పారు.