భూ కబ్జాలు చేసిన టీఆర్ఎస్ మంత్రుల లిస్ట్

భూ కబ్జాలు చేసిన టీఆర్ఎస్ మంత్రుల లిస్ట్

ఫాంహౌజ్ కోసం అసైన్డ్ ల్యాండ్ ఆక్రమించిన కేసీఆర్ కు కూడా శిక్ష పడాలన్నారు కాంగ్రెస్ లీడర్ సంపత్. కేసీఆర్ కేబినేట్ లో మంత్రిగా చేసిన ఈటల రాజేందర్...ఎర్రవెల్లి ఫాంహౌస్ లో అనేక అక్రమాలు జరిగాయని చెప్పారన్నారు. 18 మంది మంత్రుల్లో 13 మంది అసైన్డ్ భూముల్లో భూకబ్జాలు చేశారన్నారు సంపత్. సీఎం కేసీఆర్ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వీరిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రుల భూకబ్జాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు సంపత్.

మంత్రి కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ అక్రమంగా నిర్మించారన్నారు సంపత్. దేవరాయంజాల్ భూములు కూడా కేటీఆర్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యాయయన్నారు. మంత్రి మల్లారెడ్డి కూడా దేవుడి మాన్యాలు ఆక్రమించి వాళ్ళ బంధువుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి.. ఫాంహౌస్ కట్టిండన్నారు. చెరువులను కబ్జా చేసి విద్య సంస్థలు ఏర్పాటు చేశారన్నారు. రియల్టర్ ను బెదిరించి డబ్బులు కూడా వసూల్ చేసిన మల్లారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు.

మంత్రి గంగుల కమలాకర్ చరిత్ర అందరికి తెలుసన్నారు సంపత్. గంగుల వక్ఫ్ భూములను ఆక్రమించిండని..ప్రభుత్వంపైనే కోర్టులో కేసు వేశారన్నారు. గంగులకు రాసలీలా మంత్రిగా కూడా గుర్తింపు ఉందన్నారు. మరో మంత్రి పువ్వాడ అజయ్.. ఖమ్మం జిల్లాలో కోట్ల విలువ చేసే భూములను ఆక్రమించాడన్నారు. పేదలకు కేటాయించిన భూములను కూడా విడిచిపెట్టలేదన్నారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. రంగనాయకుల దేవాలయానికి చెందిన వందలాది ఎకరాల భూములను ఆక్రమించడంతో పాటు అసైన్డ్ భూములను ఆక్రమించి ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నాడన్నారు. 

మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా మహబూబ్ నగర్ లో భూకబ్జాలు చేశారన్నారు. టీఆర్ఎస్ సర్కార్ లో కీలకంగా పనిచేస్తున్న మంత్రులపై ఆరోపణలు కోర్టు కేసులున్నా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని సూర్యాపేట కలెక్టరేట్ పక్కనే  వందల కోట్ల విలువ చేసే భూములను దోచుకున్నాడన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కుష్ఠు రోగుల జాగను కబ్జా చేసిండన్నారు. 

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పాలకుర్తి, రాయపర్తి, వరంగల్ అర్బన్ లో  అసైన్డ్ భూములను కబ్జా చేశాడన్నారు.మంత్రి మహమూద్ అలీ.. ప్రధాన శాఖలకు మంత్రిగా  పనిచేశారని..మియాపూర్ ల్యాండ్, డ్రగ్ కేసు, నయీమ్ కేసు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ కేసు.. ఇలా అన్ని కేసులను తొక్కిపెట్టి దండుకున్నాడన్నారు. ఇంద్ర కరణ్ రెడ్డి.. నిర్మల్ బస్ స్టాండ్, అయ్యప్ప టెంపుల్ ల్యాండ్, నిర్మల్ చుట్టుపక్కల భూములను కబ్జాచేశాడన్నారు. 18 మంత్రుల్లో 13 మంది మంత్రుల  చిట్టా బయటపెట్టానని.. సీఎం కేసీఆర్ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వీరిపై చర్యలు తీసుకోవాలన్నారు.