బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు తీసేసే దమ్ముందా ? : కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సవాల్

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు తీసేసే దమ్ముందా ? : కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సవాల్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని కోరితే..ముస్లింలకు  రిజర్వేషన్లు లేకుంటే మద్దతిస్తామని బీజేపీ నేతలు అనడంపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు తీసేసే దమ్ముందా ? అని సవాల్ విసిరారు.

బుధవారం ఆయన గాంధీ భవన్ లో అందుబాటులో ప్రజా ప్రతినిధులు ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో  మాట్లాడారు. తెలంగాణలో ముస్లిం  రిజర్వేషన్లు తీసేస్తేనే బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని అంటున్న బీజేపీ నేతలు..మరి ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లను ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు.