సీఎం కేసీఆర్కు ప్రస్టేషన్ మొదలైంది: విజయశాంతి

సీఎం కేసీఆర్కు ప్రస్టేషన్ మొదలైంది: విజయశాంతి

జగిత్యాల: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నాం అని తెలిసి.. సీఎం కేసీఆర్ ఏదేదోమాట్లాడుతున్నారు. కేసీఆర్ కు , ఆపార్టీ నేతల్లో ప్రస్టేషన్ మొదలైందని కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శించారు. కోరుట్లలో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న విజయశాంతి..

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ పార్టీ అవినీతి పై కాంగ్రెస్ పార్టీ  పోరాటం చేస్తుందని అన్నారు. పదేళల్లో సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పుల పాలు చేశాడని ఆరోపించారు విజయశాంతి.. బీఆర్ ఎస్, బీజేపీ ఒక్కటేనని... బీఆర్ ఎస్ అవినీతిపై చర్యలు తీసుకోనందుకు ఆ పార్టీనుంచి బయటకు వచ్చానని అన్నారు విజయశాంతి. కవిత తప్పు  చేయకుంటే ఈడీ ఆఫీసుకు ఎందుకు పిలిచారని  ప్రశ్నించారు.

రెండు పార్టీల మధ్య ఒప్పందంతోనే బీజేపీ.. కేసీఆర్ అవినీతిని ప్రశ్నించడం లేదని విజయశాంతి  అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని.. ఆ పార్టీ మీటింగులన్నీ ఉత్తుత్తువే నని విజయశాంతి అన్నారు. బీజేపీలో చాలామంది కేసీఆర్ మనుషులున్నారు.. బీజేపీ, బీఆర్ ఎస్ కలిసి కాంగ్రెస్ ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

యువతకు ఉద్యోగాల ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశారని.. నిరుద్యోగభృతి ఇస్తానని మాట తప్పి వారి జీవితాలను చీకట్లోకి నెట్టారని విజయశాంతి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే.. ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా ఇచ్చి తీరుతుందని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేత విజయశాంతి.