
హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్షంలో ఉన్నంత పోరాట స్ఫూర్తి అధికార పక్షంలో ఉండదని కాంగ్రెస్ నేత విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల ఆశలను నెరవేర్చే సాఫల్యత తెలంగాణ ప్రభుత్వం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. " నా ఆలోచనా ధోరణి అంతా ప్రభుత్వం వైపు కన్నా.. ప్రజల వైపే ఉంది. దీనికి సినిమాల్లో చేసిన తిరుగుబాటు పాత్రలే ప్రేరణ కావచ్చు. ఆ విధానమే నన్ను ముందుకు నడిపిస్తున్నది. 26 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నాను.
ప్రతిపక్షంలో ఉన్నంత పోరాట స్ఫూర్తి, స్వేచ్ఛ అధికారపక్షంలో సాధ్యపడదు. అయితే, రాష్ట్రంలో నేను గెలిపించడానికి పనిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశలను నెరవేర్చే సాఫల్యత సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ" అని విజయశాంతి పేర్కొన్నారు.