కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సమగ్ర అభివృద్ధి : ఎమ్మెల్యే మందుల సామెల్

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సమగ్ర అభివృద్ధి : ఎమ్మెల్యే మందుల సామెల్

తుంగతుర్తి, వెలుగు:  తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఏఐసీసీ సభ్యుడు రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. గురువారం తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్‌‌‌‌ తో కలిసి పది మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోడౌన్​ నిర్మాణ పనులకు వారు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి సాగులో అగ్రగామిగా ఉన్న రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసమే ఈ గోడౌన్లను నిర్మిస్తున్నామ ని తెలిపారు.