గాంధీ పేరు తొలగింపు.. రాజకీయ ధ్వేషమే

గాంధీ పేరు తొలగింపు.. రాజకీయ ధ్వేషమే

పద్మారావునగర్, వెలుగు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం అమానుషమైన చర్య అని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఇది బీజేపీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా తీసుకున్న రాజకీయ నిర్ణయమని ఆరోపించారు. 

సీతాఫల్మండిలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు కోట నీలిమ, దీపక్ జాన్, అదం సంతోశ్ కుమార్, మాట్లాడారు. శ్రమకు గౌరవం, ప్రతి కుటుంబానికి ఉపాధి హక్కు అనే ఆలోచనలు గాంధీ సిద్ధాంతాల నుంచే పుట్టాయని గుర్తు చేశారు. 

కోట్లాది పేద కుటుంబాలకు వెన్నెముకగా నిలిచిన ఈ పథకాన్ని రాజకీయ ద్వేషంతో మార్చడం సరికాదన్నారు. గాంధీ పేరు తొలగించే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సురేశ్ లాల్, జగ్గు, అనిల్ పాల్గొన్నారు.